టీడీపీకి వ‌రుపుల రాజీనామా

ఏపీ టాప్ న్యూస్‌: తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈసారి ప్రత్తిపాడు టిక్కెట్ తనకు ఇవ్వకుండా వరుపుల రాజాకు ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన పార్టీని వీడుతూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, టిక్కెట్ దక్కిన వరుపుల రాజా.. సుబ్బారావుకు స్వయానా మనవడు కావడం గమనార్హం.

Share