జ‌గ‌న్‌తో డీఎల్ భేటీ

ఏపీ టాప్‌న్యూస్‌: సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ అధినేత జగన్ ను కొద్దిసేపటి క్రితం కలిశారు. ఆయనకు లోటస్ పాండ్ లో సాదర స్వాగతం లభించింది. డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు నుంచి పోటీ చేయాలనుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నారు. కానీ మైదుకూరు టీడీపీ టిక్కెట్ ను పుట్టా సుధాకర్ యాదవ్ కు చంద్రబాబు నాయుడు ఖరారు చేయడంతో టీడీపీని భూస్థాపితం చేస్తానని డీఎల్ రవీంద్రారెడ్డి శపథం చేశారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారని భావించారు. అయితే అకస్మాత్తుగా డీఎల్ లోటస్ పాండ్ కు రావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Share