టీడీపీకి బిగ్ షాక్‌!

ఏపీ టాప్ న్యూస్‌: ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇవాళ కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒంగోలు ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని మాగుంటను చంద్రబాబు కోరగా ఆయన తిరస్కరించారు. వైసీపీలో చేరి ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేయనున్నారు.

Share