ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు నో టిక్కెట్‌

ఏపీ టాప్ న్యూస్‌: తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో ఇద్దరు జంప్ జిలానీలకు టిక్కెట్ దక్కలేదు. గత ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలకు టిక్కెట్ దక్కలేదు. గత ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన జయరాములుకు టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో రాజశేఖర్ కు టిక్కెట్ దక్కింది. అలాగే ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పాలపర్తి డేవిడ్ రాజుకు కూడా చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. ఆయన స్థానంలో అజితారావుకు టిక్కెట్ దక్కింది. తొలి జాబితాలో అభివృద్ధి కోసమంటూ పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలకు బాబు బీఫారంలు ఇవ్వడం లేదు. దీంతో ఆ నియోజకవర్గాల్లో అసంతృప్తి నెలకొంది.

Share