వైయ‌స్ వివేకామృతిపై అనుమానాలు

ఏపీ టాప్ న్యూస్‌:దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోద‌రుడు, మాజీ మంత్రి వైయ‌స్ వివేకానంద‌రెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయ‌ని వైయ‌స్ కుటుంబ స‌భ్యులు, వివేకానంద‌రెడ్డి పీఏ కృష్ణారెడ్డి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. వైయ‌స్ వివేకానంద‌రెడ్డి ముందురోజు మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగించుకుని రాత్రి 11గంట‌ల‌కు వ‌చ్చి ఇంట్లో ప‌డుకున్నారు. ఆ త‌ర్వాత ఉద‌యం ఆయ‌న్ను చూసే స‌రికి విగ‌త‌జీవుడై ప‌డిఉన్నారు. కాగా వైయ‌స్ వివేకానంద‌రెడ్డి తల, చేతిపై గాయం ఉండటంతో కుటుంబసభ్యులు వివేకా మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివేకానంద రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టమ్ చేయనున్నారు. వివేకా మరణాన్ని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నామని, పోలీసులు లోతేన విచారణ చేయాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు వివేకా అంత్యక్రియలు జరగనున్నట్లు తెలిపారు.

Share