అబ్బా..చిన‌బాబూ!

ఏపీ టాప్ న్యూస్‌: అధికారంలోకి రావ‌డానికి.. వ‌చ్చిన అధికారాన్ని నిలుపుకోవ‌డానికి ఎలాంటి ప‌నులు చేయ‌డానికైనా వెనుకాడ‌ని వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడు. రాజ‌కీయాల‌లో ఆరితేరిన వ్యూహ‌క‌ర్త‌. అంతే కాదు అధికారం కోసం న‌మ్మిన సొంత మ‌నుషుల‌కు సైతం న‌మ్మ‌క ద్రోహం చేయ‌డానికి కూడా వెనుకాడ‌ని అంటుంటారు చాలా మంది. అయితే చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయాల‌లో ఆరితేరిన అప‌ర‌చాణుక్యుడు అనిపించుకుంటే కుమారుడు లోకేష్ మాత్రం ఆంధ్రా ప‌ప్పుగా పేరు పొందారు. లోకేష్‌ను ఎన్నిక‌ల బ‌రిలో దింపాల‌ని చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నం టీడీపీ నేత‌ల‌లో గుబులు పుట్టిస్తోంది. ఎందుకంటే చిన‌బాబు ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుండి నేటివ‌ర‌కు ఎలాంటి మార్పు లేక‌పోవ‌డ‌మే. చేతికి మైకు ఇస్తే చాలు ఏం మాట్లాడ‌తాడో, ఎలా క‌వ‌ర్ చేయాలో అని టీడీపీ నేత‌లు వ‌ణికిపోతుంటార‌ట‌. టీడీపీ నేత‌లు మాత్ర‌మే కాదు అనుకూల మీడియాలు సైతం త‌ల‌లు ప‌ట్టుకుంటుంటాయ‌ట‌.
తాజాగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంపై లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు టీడీపీ వ‌ర్గాల‌కు త‌ల‌నొప్పి గా మారాయి. తాను బ‌రిలో దిగిన నియోజ‌క‌వ‌ర్గం గురించి నాలుగు మాట‌లు చెప్ప‌డానికి కూడా చిన‌బాబు త‌డ‌బ‌డ‌టంతో లోకేష్ తీరుకు స్థానికులు ఎలా స్పందిస్తారో అని టీడీపీ వ‌ర్గాలు భ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. ట్వీట్ల‌తో చెల‌రేగిపోయే లోకేశ్ చేతికి మైకు ఇస్తే మాత్రం ఆయ‌న నాలుక త‌డ‌బ‌డ‌ట‌మే కాదు నాలుక మ‌డ‌త‌ప‌డిన‌ట్లు త‌ప్పుల మీద త‌ప్పులు మాట్లాడ‌టం మాత్రం ఖాయం అని చెప్పాలి. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ 1980 నుంచి టీడీపీ గెల‌వ‌లేద‌ని ఇప్పుడు తాను గెలిచేది లేనిది ప్ర‌జ‌ల చేతుల్లోనే ఉంద‌ని చెప్పారు. టీడీపీ పెట్టిందే 1982లో అయితే 1980 నుంచి గెల‌వ‌లేదంటూ చెప్పిన మాట‌ల‌కు త‌మ్ముళ్లు అవాక్క‌య్యారట‌. పార్టీ అధినేత కుమారుడై ఉండి పార్టీ ఆవిర్భావం గురించి కూడా త‌ప్పులు మాట్లాడితే తామేం చేయ‌గ‌ల‌మ‌ని నేత‌లు వాపోతున్నారు.

Share