బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం షురూ

ఏపీ టాప్ న్యూస్‌: ఎన్నికల ప్రచారబరిలోకి దిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. వెంకన్న ఆశీస్సులతో టార్గెట్ 150 నినాదంతో ముందుకు సాగుతున్నారు. శనివారం ఉదయం ఉండవల్లిలో తిరుమలకు బయల్దేరే ముందు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎదురొచ్చి కొబ్బరికాయతో దిష్టి తీశారు. అనంతరం ఉండవల్లి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయ ప్రవేశం చేసిన చంద్రబాబు దంపతులకు.. ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు స్వాగతం పలికారు. మనవడితో కలసి ఆలయ ప్రవేశం చేసిన చంద్రబాబు.. శ్రీవారిని దర్శించుకున్నారు.

చంద్రబాబు వెంకన్న దర్శనం తర్వాత తిరుపతి చేరుకుని తారక రామ స్టేడియంలో కార్యకర్తలు, క్రియాశీల నేతలు, సేవా మిత్రలు, అభిమానులతో సభ నిర్వహించారు. తర్వాత విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళం వెళ్లనున్నారు. అక్కడ కోడి రామ్మూర్తి స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పార్టీ ఎజెండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం రాత్రికి అక్కడే బస చేస్తారు.

Share