వైసీపీలోకి భారీగా చేరిక‌లు

ఏపీ టాప్ న్యూస్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుతున్నారు. గ‌త కొన్నిరోజులుగా చేరిక‌లు జ‌రుగుతున్నా ఎన్నిక‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఈ రోజు మాత్రం ప‌లు పార్టీల నుంచి భారీగా చేరిక‌లు జ‌రిగాయి. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే… తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీ‌నివాసుల రెడ్డి త‌న ప‌ద‌వికీ, పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా నాయ‌కుడు ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు.
అలాగే మాజీ మంత్రి గూడూరు నియోజ‌క‌వ‌ర్గం బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్‌, మాజీ ఎంపీ వంగా గీత‌, విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్ తాడి శ‌కుంత‌ల‌, టీడీపీ మంత్రి భూమా అఖిల‌ప్రియ మేన‌మామ ఎస్‌వీ జ‌గ‌న్ రెడ్డిలు కూడా వైయ‌స్‌జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. ఇక‌పోతే కాంగ్రెస్ పార్టీ అధికార‌ప్ర‌తినిధి పార్టీలో చేర‌గా క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా మ‌ళ్లీ వైసీపీలోకి వ‌చ్చారు. అయితే ఈ సంద‌ర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ తాను త‌ప్పుచేశాన‌ని ఒప్పుకున్నారు. ఇప్పుడు సొంత ఇంటికి వ‌చ్చినంత ఆనందంగా ఉంద‌న్నారు. కొణ‌తాల రామ‌కృష్ణ కూడా వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. పార్టీలో చేరే విష‌యం త్వ‌ర‌లోనే చెబుతామ‌న్నారు.

Share