ఏమిటి ఈ మాటలు బాబు?

ఏపీ టాప్‌ న్యూస్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్, కెసీఆర్ లు మోడీ పెంపుడు కుక్కులు అని విమర్శించారు. జగన్ కు కెసీఆర్ ఓ బంగారు బిస్కెట్ విసిరేస్తే అది కొరుక్కుంటూ ఉన్నారని ధ్వజమెత్తారు. జగన్ ప్రతి రోజూ లోటస్ పాండ్ కు వెళ్ళి కెసీఆర్ నివాసానికి పోయి ఆయన కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటున్నారని..అందుకు ఆయన ప్రతిగా జగన్ కు కుక్క బిస్కెట్లు వేస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై హైదరాబాద్ తోపాటు ఢిల్లీలో కూడా కేసులు ఉన్నాయని అన్నారు. ‘మోడీ జాగ్రత్తగా ఉండు. దేశం వదిలి పెట్టి పోవాల్సి వస్తుంది. నా మీదకు ఈడీ పంపిస్తావా? ఐటిని పంపిస్తావా? ఎవడిచ్చాడు నీకు అధికారం. ఎన్నికల సంఘం పూర్తిగా నిర్వీర్వం అయిపోయింది. ప్రతిపక్షాల మీదకు ఈడీ, ఐటిలను పంపిస్తారా?. దేవేగౌడ, మమతా బెనర్జీ, మా మీదకే కేంద్ర సంస్థలను వదులుతారా? ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు.

Share