ఆళ్లగడ్డలో టెన్షన్.. టెన్షన్

ఏపీ టాప్ న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు పూర్తయ్యాయి. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో  టెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాంటి వాటిల్లో కర్నూలు జిల్లా ఆళ్ల గడ్డ నియోజకవర్గం ఒకటి.  ఇక్కడ ఎన్నికలు పూర్తయిన ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎన్నికల తరువాత ఆళ్లగడ్డ, బనగానపల్లె, పత్తికొండ వంటి పలు నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పరస్పరం గొడవ పడ్డాయి. ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఈ ఉద్రిక్తతలు ఎక్కువగా కనిపించాయి. ఆళ్లగడ్డలోని 143వ పోలింగ్ బూత్‌లో పోలింగ్ నిలిపేయాలని వైసీపీ అభ్యర్థి గంగుల నాని ఆందోళనకు దిగారు. అయితే పోలింగ్ కొనసాగించాలని భూమా అఖిలప్రియ పోటీగా ధర్నా చేశారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యర్తలు పరస్పరం గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఓ ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. 
ఇక ఆహోబిలంలోని పలు బూత్‌లలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలోనే ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే, అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ అక్కడికి రావడంతో టీడీపీ కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు. ఈ ఘటనకు సంబంధించి భార్గవ్ రామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు పూర్తయిన తరువాత సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును కొనసాగించాలని పోలీసులు నిర్ణయించారు. 

Share