జగన్‌ సీఎం.. పక్కా!

ఏపీ టాప్ న్యూస్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, పోలింగ్‌ శాతం 80శాతానికి పెరగడమే అందుకు కారణమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఈ రోజు శ్రీకాంత్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారని, రాష్ట్రంలోనే ఉండేవారే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న బెంగళూరు, హైదరాబాద్, దుబాయ్, కువైట్‌ నుంచి ప్రవాసాంధ్రులు కష్టపడి వచ్చి ఓటును వినియోగించుకున్నారన్నారు. చంద్రబాబు నాయుడి ఐదేళ్ళ పాలనలో దుర్మంగా వ్యవహరించారని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి స్వప్రయోజనాల కోసం పనిచేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై ఉన్న ఆక్రోశంతోనే ప్రజలు చైతన్యవంతులై.. ఓటు హక్కుని వినియోగించుకున్నారని అభిప్రాయపడ్డారు. 

రానున్నవి మంచిరోజులని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజాసంక్షేమంపై దృష్టి పెడతామని శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఎన్నికల్లో టీడీపీ నేతలు అనేక అరాచకాలు సృష్టించారు. తమపై అసత్యకరమైన ఆరోపణలు సృష్టించారు. వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారు. భయనక వాతవారణం సృష్టించారు. అంతటితో ఆగకుండా ఎల్లో మీడియా ద్వారా అసత్య రాతలు రాశారు” అని శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు.

Share