సీఎం రమేష్‌పై కేసు నమోదు

ఏపీ టాప్ న్యూస్: తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్‌పై కేసు నమోదైంది. ఒక వ్యక్తి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. నిన్న ఎన్నికల సందర్భంగా పోట్లదుర్తి గ్రామంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడిపై కారు ఎక్కించే యత్నం చేసిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పైన, అతని కారు డ్రైవర్ పైన కేసు నమోదు చేశారు. పోలింగ్ బూత్ లోకి రమేష్ వెళ్లినప్పుడు సుధాకరరెడ్డి అనే వైసీపీ నేతకు, రమేష్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దానితో సీఎం రమేష్‌ ఆగ్రహించి వైయస్‌ఆర్‌సీపీ ఏజెంట్‌ అయిన వెంకటసుధాకర్‌రెడ్డిపై చేయి చేసుకున్నాడని అభియోగం.  అవమానానికి గురైన వెంకటసుధాకర్‌రెడ్డి తనకు ఎంపీ రమేష్‌ క్షమాపణ చెప్పాలంటూ అతని కారుకు అడ్డంగా రోడ్డుపై భైఠాయించాడు.

కానీ రమేష్‌ తన కారును సుధాకర్‌రెడ్డిపైకి ఎక్కించి వెళ్లిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో సుధాకర్‌రెడ్డి ఎడమ కాలు పాదం విరిగి వాపుడు గాయం అయింది. వెంటనే పోలీసులు సుధాకర్‌రెడ్డిని కారులో ఆçస్పత్రికి తరలించారు. ఈ మేరకు పడిగపాడి సుధాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ రమేష్‌తో పాటు, అతని కారు డ్రైవర్‌లపై సెక్షన్‌ 323, 324, ఆర్‌/డబ్లు్య 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు.

Share