జిల్లాల వారీగా ఓటింగ్ శాతం వివరాలు

ఏపీ టాప్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో జనం ‘ఓటెత్తారు’.  అర్ధరాత్రి వరకు క్యూలో నిల్చుని ఓట్లు వేశారు. దాదాపు 80 శాతం వరకు ఓటింగ్ జరగడంతో ప్రతిపక్ష పార్టీ తమకే గెలుపు అవకాశాలు ఉన్నాయని అంటోంది. అధికార పార్టీ కూడా తాము ఇచ్చిన పథకాలు మెచ్చే ఇంత శాతం ఓటింగ్‌ శాతం జరిగింది. ఇది తమకే అనుకూలమని చెబుతున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే. అయితే  ఈ మధ్యన వచ్చే సర్వీల ఆదారంగా రాసిందే ఈ కథనం. అయితే జిల్లాల వారీగా ఎంత శాతం ఓటింగ్ జరిగిందన్నది మాత్రం ఇప్పుడే చెప్పగలం. గుంటూరు, కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఈవీఎంలు మొరాయించడం, ఘర్షణలు చోటు చేసుకోసున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్‌ జరపాల్సిన ఆవశ్యకతపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 
జిల్లాల వారిగా పోలింగ్‌ శాతం వివరాలు
శ్రీకాకుళం: 72 శాతం
విజయనగరం: 85 శాతం
విశాఖపట్నం: 70 శాతం
తూర్పు గోదావరి: 81 శాతం
పశ్చిమ గోదావరి: 70 శాతం
కృష్ణా: 79 శాతం
గుంటూరు: 80 శాతం
ప్రకాశం: 85 శాతం
నెల్లూరు: 75 శాతం
చిత్తూరు: 79 శాతం
కర్నూలు: 73 శాతం
వైఎస్సార్‌ కడప: 70 శాతం
అనంతపురం: 78 శాతం

Share