బాబువి సిగ్గుమాలిన మాటలు

ఏపీ టాప్‌ న్యూస్‌: ‘‘చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటాడు. టెక్నాలజీని తానే కనుక్కొన్నానని అంటాడు. గతంలో ఈవీఎంలు కావాలన్నదీ ఆయనే.. ఇప్పుడు వద్దంటున్నదీ ఆయనే. 80 శాతం ఓట్లు పోల్ అయితే ట్యాంపరింగ్ చేశామని మాట్లాడడం సిగ్గుచేటు’’ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేశారని చంద్రబాబు నాయుడు అంటున్న నేపథ్యంలో బొత్స సత్యనారాయణ పై విధంగా స్పందించారు. ఇంకా ఏమన్నారంటే.. ఈవీఎంలను తాము ట్యాంపరింగ్ చేస్తామని భావిస్తే చంద్రబాబునాయుడు స్ట్రాంగ్ రూంలో పడుకోవచ్చన్నారు.

ఈవీఎంల పేరుతో చంద్రబాబు ఢిల్లీలో కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. అంబటి రాంబాబుపై కుట్రకేసు పెట్టడం దారుణమన్నారు. కోడెలపై దాడి సంఘటనను పెద్దగా విచారించాల్సిన పనిలేదని, కోడెల తీరును వీడియో పుటేజీలో చూస్తే తెలిసిపోతుందన్నారు. కాగా అంబటి రాంబాబు, వైసీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు నిరసనగా వైసీపీ నేతలు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Share