పీకే టీం చెప్పేసింది.. విజయం వైసీపీదే

ఏపీ టాప్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో విజయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని ఇప్పటికే పలు సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో రిపోర్టు బయటకు వచ్చింది.  ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. వివరాల్లోకి వెళ్లితే.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పటికప్పుడు తన టీమ్ ద్వారా సర్వేలు చేయించి వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తూ వచ్చారు. తాజా ఎన్నికలు పూర్తయిన తరువాత ఓటింగ్ సరళిని బట్టి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై కూడా పీకే టీమ్ ఓ నివేదిక రూపొందించినట్టు సమాచారం.  పీకేకు చెందిన ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి… తన గెలుపు కోసం కృషి చేసిన పీకే టీమ్‌కు అభినందనలు తెలిపారు.

వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పీకే టీమ్ జగన్‌కు వైసీపీ గెలుపు ఏ విధంగా ఉండబోతోందనే అంశానికి సంబంధించి నివేదిక కూడా ఇచ్చిందని తెలుస్తోంది. వైసీపీకి 130 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్ సభ స్థానాలు వస్తాయని పీకే టీమ్ ఇచ్చిన నివేదికలో ఉన్నట్టు సమాచారం. అధికార టీడీపీకి 40 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదని పీకే టీమ్ రిపోర్ట్ వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జోష్ లో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..  ఈ రిపోర్టుతో మరింత ఆనందంగా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Share