టీడీపీ ఆఫీస్ కు టూలెట్ బోర్డు ఖాయం

ఏపీ టాప్ న్యూస్: ‘‘తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కు ఇప్పటికే తాళం పడింది.  అమరావతిలో కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు తాళం వేయడమే కాదు.. టూలెట్‌ బోర్డు వేసుకోవడం ఖాయం’’ అని మాజీ ఎమ్మెల్సీ,  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెహమాన్ అన్నారు.  కొన్ని దుష్ట శక్తులు వైఎస్సార్‌ కుటుంబాన్ని ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా.. ప్రజాభిమానమే ఈనాటి వరకు వారికి అండగా నిలిచిందని ఆయన అన్నారు. 
పాలన అంటే ఏమిటో ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసి చూపారన్నారు. ఆయన ఆశయాలతో పార్టీని స్థాపించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే జనరంజక పాలన అందిస్తారని, అప్పుడు చంద్రబాబుకు రాజకీయ సన్యాసం తప్పదని పేర్కొన్నారు. మరో ఆరు నెలల్లో టీడీపీ పార్టీ ఐస్‌ లాగా కరిగిపోవడం ఖాయమవడంతో చంద్రబాబుకు భయంపట్టుకుందని, దీంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Share