ఓడిపోతున్నామని బాబుకు ముందే తెలుసు

ఏపీ టాప్‌ న్యూస్‌: ”చంద్రబాబు నాయుడికి ఓడిపోతున్నామని ముందే తెలిసిందా? అందుకే అలా గోల చేస్తున్నారా? ఎన్నికల కమీషన్‌ను కూడా అందులో భాగంగానే కలుస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. వివరాల్లోకి వెళ్లితే.. ఎన్నికల్లో ఓడిపోతున్న విషయం చంద్రబాబుకు అర్థమైందని, తన ఓటమిని ఎన్నికల కమీషన్ మీద నెట్టే వేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు,బీజేపీ  నేత జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ అని, ఎన్నికల సంఘం ఎవరి మాట వినదని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ మాట ఎన్నికల కమిషన్ విన్నట్లయితే మోదీ బయోపిక్ విడుదలను ఎందుకు నిలుపుదల చేస్తోందని ప్రశ్నించారు.

ఈవీఎంలు పని చేయడం లేదని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేశారని ధ్వజమెత్తారు. ఈవీఎంలలో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు సహజమని, వాటిని వెంటనే ఎన్నికల కమిషన్ సరిదిద్దిందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నరని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు.

Share