బాబు ఏమ‌న్నారో త‌ర్జుమా చేసి పంపించండి

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఝలక్ ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసి) సిద్ధపడినట్లు కనిపిస్తోంది. పోలింగ్ రోజున రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి వచ్చి చేసిన వ్యాఖ్యలను తర్జుమా చేసి పంపించాలని ఈసి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ద్వివేదీని ఆదేశించింది. పోలింగ్ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు మీ కార్యాలయానికి వ్చిచ మిమ్మల్ని ఉద్దేశించి ఏమన్నారు, ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడారు అనే వివరాలను పంపించాలని ద్వివేదికి ఈసీ సూచించింది. అందుకు సంబంధించిన వీడియో, వాయిస్ రికార్డులను కూడా పంపించాలని ఆదేశించింది. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరిగిన రోజు చంద్రబాబు ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి ద్వివేదీపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా ఆయన అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఆ రోజు జరిగిన ఏం జరిగిందనే వివరాలను ద్వివేదీ వెంటనే ఈసికి పంపించారు. అయితే, తగిన సాక్ష్యాధారాలతో వివరాలను పంపించాలని ఈసీ ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదులు, వాటి వాస్తవ పరిస్థితులపై కూడా వివరాలు పంపించాలని ఈసీ ఆదేశించింది. పోలింగ్ జరిగిన రోజు ఓటర్లను ప్రభావితం చేసినట్లు చంద్రబాబు మాట్లాడిన విషయాలను కూడా ఈసీ పరిశీలిస్తోంది. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని చేసిన విజ్ఞప్తిపై కూడా దృష్టి పెట్టింది.

Share