జీవీఎల్‌పై షూ దాడి

ఏపీ టాప్ న్యూస్‌: గ‌త కొంత‌కాలంగా రాజ‌కీయ నాయ‌కుల‌కు బ‌హిరంగ స‌భ‌ల్లోనూ, ప్రెస్‌మీట్‌ల‌లోనూ చేను అనుభ‌వాలు ఎదురవుతున్నాయి. ముఖంపై ఇంక్ చ‌ల్ల‌డాలు.. చెప్పులు విస‌రాడాలు జ‌రుగుతున్నాయి. అయితే ఇటీవ‌ల అవి మ‌రికొంత ఎక్కువ‌య్యాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా భార‌తీయ జ‌న‌త‌పార్టీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావుపై షూ దాడి జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. ఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై షూ దాడి జరిగింది. ఢిల్లీలో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుండగా.. జీవీఎల్‌పైకి ఓ వ్యక్తి షూ విసిరాడు. ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారి కలకలంరేగింది. అయినా నరసింహారావు తన ప్రెస్‌మీట్‌ను కొనసాగించారు.. ఇదంతా కాంగ్రెస్ వాళ్ల కుట్రని జీవీఎల్ ఆరోపించారు. జీవీఎల్‌పైకి చెప్పు విసిరిన వ్యక్తిని వెంటనే సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. అతడ్ని పోలీసులకు అప్పగించారు. దాడి చేసిన వ్యక్తి ఎవరన్నది ఆరా తీస్తున్నారు పోలీసులు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share