కాంగ్రెస్‌ను గెలిపించాల‌ని బాబు ప్ర‌చారం

ఏపీ టాప్ న్యూస్‌: కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీ తెలుగు దేశం పార్టీ. అలాంటి పార్టీ మొన్న తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాల‌ని.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌ని ఏకంగా చంద్ర‌బాబు నాయుడే ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నారు. బాబు ఏంటి? కాంగ్రెస్‌కు ప్ర‌చారం చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా? అయితే వివ‌రాల్లోకి వెళ్దాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు ముగిశాక చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ప్ర‌చారం చేస్తున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యే రెండుసార్లు కర్ణాటకలో కూడా కాంగ్రెస్, జెడీఎస్ అభ్యర్ధుల ప్రచారం కోసం ఏకంగా రాహుల్ గాంధీతో కలసి మరీ ప్రచారం చేశారు. చూస్తుంటే కాంగ్రెస్ గెలుపు రాహుల్ గాంధీ కంటే చంద్రబాబుకే అత్యంత అత్యవసరం అన్న చందంగా తయారైంది పరిస్థితి. ఏపీని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పై చంద్రబాబు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఏపీ ప్రజలను అంతగా మోసం చేసిన కాంగ్రెస్ కోసం చంద్రబాబు ఇంతగా తాపత్రయ పడటానికి కారణం ఏంటి?. తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎప్పుడైనా..ఎవరితో అయినా పొత్తు పెట్టుకోగలరని ఇప్పటికే పలుమార్లు నిరూపితం అయింది.
గోధ్రా అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేసి..జన్మలో బిజెపితో కలవనని శపథం కూడా చేశారు. ఆ శపథాన్ని తీసి గట్టున పెట్టి..2014 ముందు మోడీ వేవ్ ను గుర్తించి బిజెపితో జట్టుకట్టారు. మళ్ళీ బయటకు వచ్చి..గోద్రా అల్లర్ల గురించి మాట్లాడే తెగువ..ధైర్యం చంద్రబాబుకు తప్ప ఎవరికీ లేదు. అంతే కాదు..అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి ఏపీ రైతుల ప్రయోజనాలకు గండికొట్టిన దేవేగౌడ, ఆయన మనవడి కోసం…బాబ్లీ వంటి అక్రమ నిర్మాణం చేపట్టి తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చంద్రబాబు ప‌ని చేయ‌డం నిజంగా బాధాక‌రం.

Share