వైసీపీ నేత‌ల‌కు కుటుంబ‌రావు క్ష‌మాప‌ణ‌లు

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు.. వెనక్కి తగ్గారు. ఆయన తాజాగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేత‌కు క్షమాపణలు తెలిపారు. సోమవారం కుటుంబరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే… ఆ వ్యాఖ్యలు ఓ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉందనే వాదనలు వినపడ్డాయి. ఈ క్రమంలో కుటుంబరావు క్షమాపణలు తెలిపారు. వ్యవహారిక గ్రామీణ భాషా ప్రయోగమే తప్ప ఇందులో ఏ ఒక్కరిని కించపరిచే ఉద్దేశంతో చేసింది కాదని ఆయన చెప్పారు.
వైసీపీ అధినేత వైయ‌స్‌జగన్ మోహన్ రెడ్డికి భజనపరులుగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. ఈ వ్యాఖ్యలు ఒక కులానికి మనస్తాపం కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నానన్నారు. ఇందులో ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదని కుటుంబరావు మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఈయన క్షమాపణలపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ట నేత‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Share