బాబు ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి

ఏపీ టాప్ న్యూస్‌:“ నారా చంద్ర‌బాబు నాయుడు త‌న ఐదేళ్ల పాల‌న‌లో ఎన్నో త‌ప్పులు చేశాడు. ప్ర‌జ‌ల‌కు అది చేస్తాం. ఇది చేస్తామ‌ని మాయ మాట‌లు చెప్పి మోసం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను విభ‌జించి ఆంధ్రుల‌కు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో చంద్ర‌బాబు క‌లిసి తిరుగుతున్నాడు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీవ్ర అన్యాయం చేశాడు. అందుకే చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాలి“ డిమాండ్ చేశారు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు సి.రామ‌చంద్ర‌య్య‌. చంద్ర‌బాబు స్వార్థ రాజ‌కీయాల‌పై ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రామ‌చంద్ర‌య్య మాట్లాడుతూ చంద్రబాబు అవసరాన్ని బట్టి రంగులు మార్చే ఊసరవెల్లి అని అన్నారు. విభజనకు ముందు సోనియా దెయ్యమని, రాహుల్‌ గాంధీ అని పనికిరాని వ్యక్తి అని ఇప్పుడేమో సోనియా గొప్ప నాయకురాలు, రాహుల్‌ విజన్‌ ఉన్న నేత అని చెప్పడం రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడవటం కాదా ఆయన ప్రశ్నించారు.
టీడీపీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్‌తో సిగ్గు లేకుండా చేతులు కలిపారంటూ విమర్శించారు. విభజన తరువాత కాంగ్రెస్‌ అధినేతలు రాష్ట్రానికి వస్తే.. నిరసనలు తెలిపి.. ఇప్పుడు వాళ్లను పొగుడుతున్నారని చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు నాటకాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. పారదర్శకత అనేది లేకుండా రహస్యంగా జీవో జారీ చేశారంటూ దుయ్యబట్టారు. ఇంతటి ఘోరమైన పాలన దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత కూడా అప్పులు తెచ్చిన ఘనుడు దేశ చ‌రిత్ర‌లో ఎవ‌రైనా ఉన్నారంటే అది ఒక్క చంద్ర‌బాబు నాయుడేన‌ని దుయ్య‌బ‌ట్టారు.

Share