గెలుపుపై జ‌గ‌న్ ధీమా!

ఏపీ టాప్ న్యూస్‌: ఎన్నికల కమిషనేమో పోలింగ్ కు, ఫలితాలకూ చాలా దూరాన్ని పెట్టింది. నెలన్నర వ్యవధిని పెట్టింది. ఈ పరిస్థితుల్లో రోజులు లెక్కబెడుతున్నారు రాజకీయ ఆసక్తి ఉన్న వాళ్లు. ఫలితాలు గురించి వారు అలా వేచి చూస్తూ ఉన్నారు. ఇక రాజకీయ నేతలు కూడా ఈ విషయంలో భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. ఎవరికి వారు తమదే విజయం అనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వారు చెబుతున్న మాటలకూ, చేస్తున్న చేతలకు మధ్యన పొంతన గురించి జనాలు ఆలోచిస్తూ ఉన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ భారీ స్థాయి విజయం సాధించడం ఖాయమని పైకైతే చెబుతూ ఉన్నారు. అయితే బాబు ఈవీఎంల మీద అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు.
దీంతో అసలు తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందా? అనేది సందేహంగా మారింది. గెలిచే పరిస్థితి ఉంటే.. ఈవీఎంల మీద బాబు అలా అనుమానాలను వ్యక్తం చేసే వారు కాదనేది బాగా వినిపిస్తున్న మాట.
ఇక వైయ‌స్‌ జగన్ మాత్రం ఫలితాలపై ధీమాతో ఉన్నారు. తమది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని జగన్ అన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ధీమా ఏమిటి? అంటే.. జగన్ చాలా విస్తృతమైన సర్వేలు చేయించుకున్నారని, మొత్తం ఆరు విభిన్న సంస్థల ద్వారా జగన్ సర్వేలు చేయించుకున్నారని.. అవన్నీ జగన్ కు పాజిటివ్ సంకేతాలు ఇచ్చాయని, ప్రీ పోల్ –ఎగ్జిట్ పోల్ సర్వేలను జగన్ తీసుకున్నారని.. అన్నీ కూడా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లకు తగ్గే అవకాశం లేదని భరోసాను ఇవ్వడంతో జగన్ విజయం పట్ల ధీమాతో ఉన్నారని ఆయ‌నకు స‌న్నిహితంగా ఉన్న‌వారు అంటున్నారు.

Share