సుభాషణ్ రెడ్డి భౌతికఖాయానికి జగన్ నివాళులు

ఏపీ టాప్ న్యూస్‌: తమిళనాడు, కేరళ మాజీ చీఫ్ జస్టీస్ సుభాషణ్ రెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అవంతి నగర్ లోని ఆయన నివాసంలో సుభాషణ్ రెడ్డి భౌతికఖాయానికి గవర్నర్ నరసింహన్ దంపతులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు తదితరులు నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి.
కాగా అంత‌కు ముందు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి(69) మృతిపై వైయ‌స్ జ‌గ‌న్ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Share