మంత్రిప‌ద‌వికి కిడారి రాజీనామా

ఏపీ టాప్ న్యూస్‌: మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఏ చట్ట సభలోనూ సభ్యుడు కానందునన శ్రవణ్‌తో రాజీనామా చేయించాల్సిందిగా గవర్నర్ నరసింహన్.. సీఎం చంద్రబాబుకు సూచించారు. ఈ నేప‌థ్యంలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు సూచనతో శ్రవణ్ తన పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌తో సమావేశమైన శ్రవణ్.. రాజీనామా విషయంపై చర్చించారు. అనంతరం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రకు అందజేశారు.
అనంత‌రం కిడారి శ్ర‌వ‌ణ్ కుమార్ మాట్లాడుతూ తనను చంద్ర‌బాబు నాయుడు ప్రోత్సహించారని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేసినట్టుగా ఆయన తెలిపారు. లోకేష్ కూడ తనను సొంత‌ తమ్ముడిగా చూసుకున్నార‌న్నారు. చట్టసభల్లో తాను సభ్యుడిగా లేనందున మంత్రి పదవికి రాజీనామా చేశామన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించి తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించారు.

Share