టీవీ9 నుంచి ర‌విప్ర‌కాష్ ఔట్‌

ఏపీ టాప్ న్యూస్‌: ర‌విప్ర‌కాష్ ను టీవీ9 సీఈఓ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ యాజ‌మాన్యం నిర్ణ‌యం తీసుకుంది. ర‌విప్ర‌కాష్ పోర్జ‌రీ సంత‌కాల‌తో మోసానికి పాల్ప‌డ్డార‌ని గుర్తించిన యాజ‌మాన్యం పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న ర‌విప్ర‌కాష్ ను సంస్థ తొల‌గించింది. టీవీ9లో 90 శాతం వాటాను అలంద మీడియా సంస్థ కొనుగోలు చేసినా యాజ‌మాన్య మార్పును అడ్డుకునేందుకు న‌టుడు శివాజీతో క‌లిసి ర‌విప్ర‌కాష్ న‌ట‌కాలు అడుతున్నార‌ని సంస్థ గుర్తించింది. ప్ర‌స్తుతం సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ర‌విప్ర‌కాష్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ర‌విప్ర‌కాష్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Share