యూ ట‌ర్న్ బాబు

ఏపీ టాప్ న్యూస్: యూట‌ర్న్‌కు కేరాఫ్ ఎవ‌రంటే.. వెంట‌నే చంద్ర‌బాబు నాయుడు అని ప్ర‌జ‌లు చెప్పే ప‌రిస్థితికి వ‌చ్చింది. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఐదేళ్ల ప‌ద‌వీ కాలం ముగిసే వ‌ర‌కు కూడా ప్ర‌తి దానిలో చంద్ర‌బాబు యూట‌ర్న్ తీసుకున్నారు. బాబు తీసుకున్న యూట‌ర్న్‌ల గురించి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పారు. రైతుల రుణ‌మాఫీ, డ్వాక్రా మ‌హిళ‌ల రుణ‌మాఫీ, బెల్ట్ షాపులు, నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం, పోల‌వ‌రం, మ‌రీ ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇలా ప్ర‌తి దానిలో కూడా బాబు యూట‌ర్న్ తీసుకున్నారు. తాజాగా బాబు మ‌రో దానిపై కూడా యూట‌ర్న్ తీసుకున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌, శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు అంటున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలిసి ఆప‌ద్ధ‌ర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ప్రతి దానికీ పెద్ద ఎత్తున రగడ చేస్తున్నారని ఉమ్మారెడ్డి విమ‌ర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడతలోనే ఎన్నికలు జరిగేలా షెడ్యూల్‌ ప్రకటించిన ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు తొలుత తప్పుపట్టారని, ఇప్పుడు తొలి విడతలో ఎన్నికలు జరగడం వల్ల తమకు మేలు జరిగిందంటూ యూటర్న్‌ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ఓడిపోయి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని చంద్రబాబుకు తెలిసిపోయిందని, అందుకే ప్రతి దానికీ పెద్ద రగడ సృష్టిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలా అడ్డ‌దిడ్డంగా మాట్లాడ‌డం, యూట‌ర్న్‌లు తీసుకోవ‌డంలో చంద్ర‌బాబును మించిన‌వారు ప్ర‌పంచంలోనే ఎవ‌రూ లేర‌ని ఉమ్మారెడ్డి అన్నారు.

Share