చంద్ర‌బాబు నాయుడు మాన‌సిక వైద్యుడిని క‌లిస్తే మంచిది

ఏపీ టాప్ న్యూస్‌: చంద్ర‌బాబు నాయుడు తెలుగువారి గౌరవాన్ని దేశస్థాయిలో పరువు తీస్తున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఆరోపించారు. ఓటమి భయంతో చంద్రబాబు రకరకాల వేషాలు వేస్తూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలు, జాతీయ నాయకులను కలిసిన చంద్రబాబు చివరిగా మానసిక వైద్యుడిని కలిస్తే మంచిదని సూచించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు టీడీపీని రాజకీయాల నుంచి ఎగ్జిట్‌ అయ్యేలా చేశాయంటూ సెటైర్లు వేశారు. 2024 కల్లా టీడీపీ ముక్కలైపోతుందని తెలిసి చంద్రబాబు నాయుడు జాతీయ నేతలను డిస్ట్రబ్‌ చేస్తున్నారని పండుల రవీంద్రబాబు ఆరోపించారు.
ఈసారి జరిగిన ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని రవీంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీకి 150 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వస్తే 30-40 ఏళ్లు పాలిస్తారని తెలిసి చంద్రబాబు నాయ‌కుడికి వణుకుపుట్టుకుందన్నారు. మే 23 తర్వాత వచ్చే ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ను మించి ఉంటాయని తెలిపారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ పండుల రవీంద్రబాబు.

Share