మోదీకి ప్రేమ‌ను పంచిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ షాక్ ఇచ్చారు. మోడీ వద్ద‌కు వెళ్లి ఆలింగ‌నం చేసుకొని రాహుల్ స‌బీకుల‌ను ఆక‌ట్టుకున్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల అమ‌లుపై టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌స‌భ‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. మొద‌ట టీడీపీ ఎంపీ గ‌ల్ల జ‌య‌దేవ్ ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని వివ‌రిస్తూ ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు చేశారు. ఆ త‌రువాత మాట్లాడిన రాహుల్ గాంధీ గంట సేపు ఏక‌ధాటిగా ప్ర‌సంగించారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ తరపున ప్రసంగించిన రాహుల్‌.. మోదీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.

గతంలో ప్రధాని మోదీని ఉపాధి అడిగితే పకోడి చేసుకోమన్నారంటూ రాహుల్‌ విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రధాని హామీలకు విలువ ఉండాలన్న రాహుల్‌.. నేడు దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. ‘భారతీయ యువత ప్రధాని మోదీపై నమ్మకం పెట్టుకుంది. అదే క్రమంలో ఉపాధి అడిగితే పకోడి చేసుకోమని మోదీ సలహా ఇచ్చారు. నాలుగేళ్లలో నాలుగు లక్షల మందికి మాత్రమే ఉపాధి కల్పించారు. మేము జీఎస్టీని తెస్తామని అప్పుడే చెప్పాం. కానీ మోదీ వ్యతిరేకించారు. చిన‍్న తరగతి, మధ్య తరగతి ప్రజలను కేంద్రం పట్టించుకోవడం లేదు. కార్పోరేట్లు, బడా వ్యక్తులకే మోదీ ప్రధాన్యత ఇస్తున్నారు.

దేశానికి సేవకునిగా ఉంటానని మోదీ అన్నారు. ప్రధాని మోదీ గారడీ మాటలతో ప్రజలు మోసపోయారు. పది మంది కుబేరులు కోసం మాత్రమే మోదీ పనిచేస్తారు. పెద్ద పెద్ద వ్యాపారులను మాత్రమే మోదీ అని రాహుల్‌ విమర్శించారు. ప్ర‌సంగం చివ‌రిలో రాహుల్ త‌న‌ను పప్పు అన్న ఎలాంటి కోపం లేద‌ని త‌న‌పై ధ్వేషం పెంచుకున్నవారిలో ప్రేమ‌ను పంచుతాన‌ని త‌న సీట్లో నుంచి వెళ్లి మోదీని ఆలింగ‌నం చేసుకొని వెనుతిరిగారు. రాహుల్ చ‌ర్యతో ఒక్క‌సారిగా స‌భ‌లో ఉద్వేగ ప‌రిస్థితులు క‌నిపించాయి.

Share

One thought on “మోదీకి ప్రేమ‌ను పంచిన రాహుల్ గాంధీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × three =