మొన్న రాజ్యసభకు పడిపోయాడు.. ఈసారో..?

ట్విట్టర్‌లో తప్ప ప్రశ్నించడం చేతకాని పవన్‌ కల్యాన్‌… ఈ మధ్యనే నోరు విప్పి మాట్లాడుతున్నాడు. ఆయన బయటకొచ్చి మాట్లాడటం మొదలు పెట్టారో లేదో… చీకటి ఒప్పందాలు బయట పడుతున్నాయి. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబును కలిసిన విషయాలు.. వారిద్దరూ ఏమని మాట్లాడుకున్నదీ పవన్‌ కల్యాణ్‌ బయటపెట్టేశాడు. 2012లోనే తాను చంద్రబాబును కలిశానని, పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో 60–70 సీట్లలో పోటీ చేయాలనే తన మనసులో మాటను చంద్రబాబుతో పంచుకున్నట్టు విజయవాడలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్‌ చెప్పారు. జనసేన పోటీచేస్తే ఓట్లు చీలిపోతాయని చంద్రబాబు వారించడంతో ఎన్నికల్లో పోటీ చేయలేదనే రహస్య ఒప్పందాన్ని ఆయన బహిరంగపరిచారు.
చీకటి ఒప్పదం వెనుక..
ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ మాటల వెనుక మర్మం స్వయంగా ఆయన నోటి నుంచే బయటకొచ్చింది. జగన్‌ గెలిచి అధికారం చేపట్టడం ఇష్టం లేకనే ముందస్తు ప్రణాళికలో భాగంగా వారిద్దరూ కలిసి డ్రామా ఆడినట్టు తేటతెల్లమైంది. అయితే బయటకు మాత్రం మార్పు, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూళన.. వంటి పడికట్టు పదాలతో ఎన్నికల ముందు హడావుడి చేశాడు. పదవీ వ్యామోహం లేదు, పోటీ చేసే ఆలోచన లేదు.. అధికారం లేకపోయితే ప్రజాసేవ చేయలేవా అంటూ చిలుక పలుకులు పలికిన పవన్‌ కల్యాణ్‌ గడిచిన ఆరు నెలలుగా బాగా మారిపోయారు.
పవన్‌ కల్యాణ్‌ జనాల్లోకి రావడం మొదలు పెట్టింది కూడా ఈ ఆరు నెలల నుంచే. అంతకముందు కూడా అప్పుడప్పుడు వచ్చి చిన్న చిన్న ముఖాముఖిలు.. అరేంజ్డ్‌ బహిరంగ సభల్లో ప్రసంగించినా అదంతా చంద్రబాబును కాపాడేందుకేనని నాయకుల నుంచి ప్రజల వరకు అందరిలో ఉన్న అభిప్రాయం. కానీ ఈ ఆరు నెలల్లో పవన్‌ కళ్యాణ్‌ తీరులో భారీ మార్పు కనిపించింది. 2014 ఎన్నికలకు ముందు నుంచీ ఈ నాలుగేళ్లలో ఎంతో ఆదర్శభావాలు కలిగిన వ్యక్తిగా కనిపించిన పవన్‌కూ.. ఈ ఆరు నెలల నుంచి కనిపిస్తున్న పవన్‌ పూర్తి భిన్నం. పోటీ చేసే ఉద్దేశ్యమే లేదన్న వ్యక్తి ఒక సారి అనంతపురం నుంచి.. ఒకసారి ఏలూరు నుంచి.. మరోసారి పాడేరు నుంచి ఇలా తడవకోసారి ఎక్కడికి పోతే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చాడు.
ప్రజాసేవ చేయడానికి అధికారం దేనికి.. ఎమ్మెల్యేలు, ఎంపీ పదవులు దేనికి అన్న వ్యక్తి ఇప్పుడు నాకు పది మంది ఎంపీలు ఉండి ఉంటే.. పది మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే అని… రాగాలు తీస్తున్నాడు. అసలు నిన్న మొన్నటి వరకు కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలో లేదో కూడా ఆయనలో స్పష్టత లేదు. రేపు పోటీ చేస్తాడో లేదో కూడా చివరి నిమిషం వరకు కూడా కన్ఫార్మ్‌గా చెప్పలేం. మాటలు మార్చడంలో బాబును మించిపోతున్నాడు
అవసరాలను బట్టి మాటలు మార్చడంలో పవన్‌ కల్యాన్‌ కూడా బాబును మించిపోతున్నాడు. ఆయన యూటర్న్‌లు తీసుకుంటుంటే.. ఈయన సీఎం కుర్చీ మీద ఆశలు పెంచుకుంటున్నాడు. పవన్‌ కల్యాణ్‌కు అదంత ఈజీగా సాధ్యమయ్యే అవకాశం లేదని ఆయనకు కూడా తెలుసు. కాకపోతే కర్నాటక ఎన్నికల ఫలితాలు పవన్‌లో సీఎం పదవి మీద ఆశలు రేకెత్తించాయి. నిర్ణయాత్మకంగా మారగలిగితే.. తనకు పదవి దక్కే అవకాశం ఉందని కలలు కంటున్నట్టున్నాడు. మొన్నటి ఎన్నికల్లో జగన్‌ ఓటమి కోసం చంద్రబాబుతో కలిసి పనిచేసిన పవన్‌ కల్యాణ్‌.. రాబోయే ఎన్నికల్లో తన వ్యూహాన్ని ఎలా మార్చబోతున్నాడో చూద్దాం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 5 =