ఛీ.. ఏంటి బాయ్యా !

ఏపీ టాప్ న్యూస్‌: ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల కోసం టీడీపీ ఎంపీలు పార్ల‌మెంట్ వ‌ద్ద ఆందోళ‌న‌ చేస్తున్నవిష‌యం తెలిసిందే. అయితే ఈ ఆందోళ‌న‌లో చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నారు. రోజుకో వేషం వేసుకుని ప్ర‌ధాని మోడీ తీరును ఎండ‌గ‌డుతున్న శివ‌ప్ర‌సాద్ ఈ రోజు థర్డ్ జెండర్ ప్రతినిధిగా క‌నిపించారు. ‘మోడీ బావా… ప్రత్యేక హోదా… ఇవ్వకుంటే…. నీ అంతం ఆరంభం అంటూ’ ఎంపీ హాస్య గీతం ఆలపించారు.

ఈ సంద‌ర్భంగా శివ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీకి అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పిన మోదీ ఇప్పుడు అవన్నీ మరిచిపోవడం దారుణమన్నారు. అయితే టీడీపీ ఆందోళ‌న‌లు ఏమోకానీ శివ‌ప్ర‌సాద్ మాత్రం రోజుకో వేషంతో ఎంపీల‌ను బాగా న‌వ్విస్తున్నారంటూ నెటిజ‌నులు కామెంట్లు పెడుతుండ‌డం విశేషం.

Share