ఏమిటీ రాజకీయ కుట్ర…?

చివరకు జగన్‌పై కుట్ర‌ కేసుల్లో ఆయన భార్య పేరును కూడా ఇరికించేశారు… సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో ఆమె పేరు లేకపోయినా సరే, ఈడీ కేసుల్లోకి వచ్చేసరికి అకస్మాత్తుగా ఆమె పేరు ప్రత్యక్షమైంది… భారతి పేరు కనిపించడం వెనుక ఏమిటీ రాజకీయ కుట్ర…?
మెల్లిమెల్లిగా కొంత సమాచారం బయటికి వస్తున్నది… ఆగదు కదా… మోడీతో సాన్నిహిత్యం ఉంద‌ని బాగా ప్ర‌చారం జ‌రుగుతున్నా..అది నిజ‌మ‌నిపించ‌డం లేదు. జగన్ గానీ, సాయిరెడ్డి గానీ కొన్ని ‘అవాంఛనీయ శక్తుల్ని’ ఈడీ నుంచి బయటికి పంపించడంలో ఫెయిలయ్యారు.. అదీ కారణం. పర్టిక్యులర్‌గా భారతి పేరును ఇరికించడంలో మోడీ ప్రమేయం గానీ, బీజేపీ హిడెన్ ఎజెండా గానీ ఏమీ లేవు. పైగా అది రొటీన్ ప్రొసీజరల్ ఇంక్లూజన్ కూడా కాదు… అది పక్కాగా ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో పనిచేసిన ఓ తెలుగుదేశం వీరాభిమాని, మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి మనిషి వల్ల చోటుచేసుకున్న ఉద్దేశపూర్వక కక్షసాధింపు అంటున్నారు… కక్షసాధింపు అంటే… తనకేదో అన్యాయం జరిగిందని కాదు… తెలుగుదేశం అంటే ఓ పర్వర్షన్… అంతే… భారతి పేరును కూడా నిన్నో, మొన్నో ఇరికించింది కాదట… ఇది జరిగి 3 నెలలయిందట… మరో విషయమూ ఉందండోయ్…
ఇది జగన్ ట్వీట్…
చివరకు కుటుంబాన్ని కూడా ఈడుస్తున్నారు, రాజకీయాలు అంత దిగజారాలా..? సెలెక్టెడ్ మీడియాలో వచ్చిన వార్తలు బాధాకరంగా ఉన్నాయి అంటూ ఏదో చెప్పాడు. నిజానికి ఇందులో బీజేపీ రాజకీయాలు లేవు. అన్నీ తెలుగుదేశం రాజకీయాలే. సెంట్రల్ ఎక్సయిజులో పనిచేసే ఓ అధికారి ఈడీలో చేరి, అయిదేళ్ల తరువాత తప్పనిసరిగా మాతృశాఖలోకి వెళ్లాల్సి ఉన్నా వెళ్లకుండా, తెలుగుదేశం నాయకులు, బీజేపీలోని టీడీపీ కార్యకర్తలు కమ్ పెద్ద నాయకుల సహకారంతో ఢిల్లీలో పనిచేసే కేంద్ర నిఘా సంస్థల పెద్దల ఆశీస్సులతో అలా అలా కొనసాగుతూ వచ్చాడు. తెలుగుదేశం కేసులేమైనా ఉంటే చూసీచూడనట్లు ఉండటం, లేదంటే మరుగుపరచడంతో పాటు వీలైనంతవరకూ జగన్‌ను ఫిక్స్ చూస్తూ పోవడం వాళ్ల పని అట. ఎడాపెడా జగన్ ఆస్తుల్ని అటాచ్ చేయడం వెనుక సూత్రధారి కూడా ఆయనేనట. అయితే గత ఏడాది జగన్ కూడా దీన్ని గమనించాడు. ప్ర‌ధాని మోడీని క‌లిసి ఫిర్యాదు చేశాడు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలుగుదేశం పట్ల బాగా సానుకూలత ఉన్న వ్యక్తి. ఐనా సరే మోడీ మందలించాడ‌ట.
కానీ ఈడీలో ఓ కీలకస్థానంలో ఉన్న జగన్ ద్వేషిని మాత్రం కదిలించలేదు. వీళ్లూ తరువాత పెద్దగా పట్టించుకోలేదు. ఆ అధికారి పోతూ పోతూ జగన్ భార్య పేరును కూడా ఇరికించి, ఇక తప్పనిసరై ఈడీని వదిలివెళ్లాడట. అయితే, ఈడీ కేసుల్లో ఆమె పేరును ఇరికించడం వల్ల జరిగే నష్టం ఏమిటి..? ఏమీ ఉండదు. తాజా ఫిర్యాదుల్లో కొత్త వివరాలు ఏమీ లేవు. ఆమెను కూడా నిందితురాలిగా యాడ్ చేయడం మినహా కేసంతా పాతదే. నిజానిజాలు కోర్టులో విచారణల సందర్భంగా తేలాల్సిందే. కాకపోతే ఈడీ కేసుల విచారణకు ఆమె కూడా హాజరవ్వాల్సి ఉంటుంది. అంతే…! అన్నట్టు…ఈడీలో ప‌నిచేసిన మాజీ అధికారి, తిరిగి ఈడీలోకి రావటానికి పావులు కదుపుతున్నాడట.

Share