మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా

ఏపీ టాప్ న్యూస్‌: టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త షోయబ్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. ‘ఈ మంచి వార్త మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నా సతీమణి కూడా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమకు, అభిమానానికి ఆశీస్సులకు నా ధన్యవాదాలు’ అని చెబుతూ ‘బేబీ మీర్జా మాలిక్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం సానియాకు ఆమె అభిమానుల నుండి అభినందనలు సోషల్ మీడియాలో వెల్లువలా వచ్చి పడుతున్నాయి. మొదటి బిడ్డకు జన్మనిచ్చిన సందర్భంగా ఇరు కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారని.. ముఖ్యంగా షోయబ్ మాలిక్ చాలా సంతోషపడుతున్నారని.. సానియా మేనేజర్ మీడియాకి తెలిపారు.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహం 2010లో జరిగిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా టెన్నిస్‌కు దూరంగా ఉన్న సానియా 2020 ఒలింపిక్స్‌లో తన సత్తా చాటుతానని అంటున్నారు. అయితే సానియా, షోయబ్ దంపతులు ఫోటోలు ఏవీ ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవ్వలేదు. వాటిని పోస్టు చేయకుండా గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.

Share