ప‌రువు కాపాడిన పుజారా

ఏపీ టాప్ న్యూస్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు చతేశ్వర్ పుజారా సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతడికి ఇది 16వ సెంచరీతో పాటు… టెస్ట్ క్రికెట్‌లో 5000 పరుగులు పూర్తి చేశాడు. కాగా భార‌త్ -ఆస్ట్రేలియాల మ‌ధ్య జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్సింగ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాపై ఆస్ట్రేలియా బౌల‌ర్స్ ప‌ట్టు బిగించారు. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ఒక్క పుజారా మాత్రమే సెంచరీ చేయగా మిగతా ఆటగాళ్లు తక్కువ పరుగులకే పెవిలియన్ దారి పట్టారు. తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 250 పరుగులు చేయగా…ప్ర‌స్తుతం క్రీజ్‌లో షమీ (6), బుమ్రా (0) ఉన్నారు.

ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11), విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13), చతేశ్వర్ పుజారా (123), అశ్విన్ (25), రోహిత్ శ‌ర్మ (37), రిష‌బ్ పంత్ (25), ఇషాంత్ శర్మ (4), షమీ (6) పరుగులు చేశారు. ఆస్రేలియా బౌలర్స్‌లో హాజిల్‌వుడ్‌ రెండు వికెట్స్ , లియాన్‌కి రెండు వికెట్స్, స్టార్క్‌, క‌మిన్స్ చెరో రెండు వికెట్స్ తీసారు.

Share