ఇదంతా చంద్ర‌బాబు ప‌నేనా?

ఏపీ టాప్ న్యూస్‌: ఫ‌లితాలు రాక ముందే తెలంగాణ‌లో ప్ర‌లోభాల ప‌ర్వం మొద‌లైందా? ఒక్క ఎమ్మెల్యేకి కోట్లు పోసి కొనేందుకు కాంగ్రెస్‌పార్టీ సిద్ధ‌మైందా? అంటే అవున‌నే అంటున్నారు. నాగ‌ర్ క‌ర్నూల్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్ర‌లోభాల‌కు పాల్ప‌డుతోందా ఆధారాల‌తో స‌హా చూపించారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. తెలంగాణ‌లో త‌మ‌కు పూర్తి స్థాయి మెజారిటీ రాద‌ని భ‌య‌ప‌డ్డారో ఏమో తెలియ‌దు కానీ ప్ర‌లోభాల‌కు మ‌ర్రి జ‌నార్ధ‌న్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నేత‌లు వ‌ల వేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. జ‌నార్ధ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తక్కువ పడితే మద్దతివ్వాలని నాగర్ కర్నూల్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ చేశార‌ట‌. జానా రెడ్డి ఇంట్లో మాట్లాడుకుందాం అని తనతో చెప్పార‌ని మీడియా ముఖంగా చెప్పారు. వరుసగా రెండుసార్లు విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. టీ ఆర్ ఎస్ పార్టీ తరపున గెలవబోయే అభ్యర్థులను కాంగ్రెస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
అయితే చంద్రబాబుకు వత్తాసు పలకకుండా ఆయన మాయలో నుంచి బయటకు రండి అని విశ్వేశ్వర్ రెడ్డికి చెప్పి ఫోన్ పెట్టేసినట్లు మర్రి పేర్కొన్నారు. పదవులకు అమ్ముడుపోయే వ్యక్తిత్వం తమది కాదని.. తమది కేసీఆర్ సైన్యం అని మర్రి జనార్ధన్ రెడ్డి తేల్చిచెప్పారు. లగడపాటి సర్వేలతో ప్రజలను గందరగోళానికి గురి చేసి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం మంచిది కాదన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం కాబోతున్నారని.. 80 నుంచి 85 స్థానాలు టీ ఆర్ ఎస్ కైవసం చేసుకుంటుందని మర్రి జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఇదంతా చంద్ర‌బాబు ప‌నేన‌ని టీఆర్ఎస్ నేత‌లు అంటున్నారు. ఏపీలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను కొన్న‌ట్లుగా తెలంగాణ‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనాల‌ని చూస్తున్నార‌న్నారు. ఏపీలో సంపాదించిన ల‌క్ష‌ల కోట్లు అవినీతి సొమ్ముతో ఇక్క‌డ కూడా నీచ రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తున్నార‌ని టీఆర్ఎస్ నేత‌లు మండిప‌డుతున్నారు.

Share