సంక‌ల్ప‌యోధుడు

ఏపీ టాప్ న్యూస్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న పాదయాత్ర యావత్తు జన హర్షంతో కొనసాగుతోంది. అడుగడుగునా ప్రజలు తమ సమస్యలను జగన్‌కు వివరిస్తూ, ప్రస్తుత టీడీపీ సర్కార్‌ చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రస్తావిస్తున్నారు. రైతులు తమ పంటలకు మద్దతు ధరలేదంటూ వాపోతుంటే..తమకు సమాన పనికి సమాన వేతనం రాలేదంటూ కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే మరికొందరైతే పింఛన్‌లకు అర్హతున్నా పట్టించుకోవడం లేదని, నిరుద్యోగులంతా ఉద్యోగాలు లేవంటుంటే..ఉన్న ఉద్యోగాలకు భద్రత లేదంటూ కొందరు జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రజలందరి మద్దతుతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని భరోసా ఇస్తూ జగన్‌ ముందుకు సాగుతున్నారు. అలాగే జగన్‌ పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన మహిళలు, వృద్ధులు “ నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందంటూ “ ఆశీర్వదిస్తుండ‌డం విశేషం.

Share