తీరం దాటిన పెథాయ్‌

ఏపీ టాప్ న్యూస్: రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను గ‌త రెండు రోజులుగా భ‌య‌పెట్టిన పెథాయ్ తుఫాన్ తీరం దాటింది. కాకినాడ – యానాం వ‌ద్ద తీరం దాటి ఒడిశా దిశ‌గా ప‌య‌నిస్తోంది. పెథాయ్ తుఫాన్ కార‌ణంగా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. తీరం వెంబ‌డి బ‌ల‌మైన ఈదురు గాలులు వీస్తున్నాయి. పెథాయ్ ప్ర‌భావంతో తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి ,విశాఖ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్రమైన ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల చెట్లు నేలకూలాయి. వ‌ర్షాల‌ల‌ కారణంగా కోతకు వచ్చిన వరిపంట నీట మునిగింది. తూర్పు గోదావరిలో పలు చోట్ల కరెంట్ సరఫరా నిలిపివేశారు.రైళ్లు, బస్ లు ఆగిపోయాయి. కోనసీమ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి.కొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కాగా 107 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి చినరాజప్ప చెప్పారు. కాగా రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, ఖాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో మరో గంటలో కుండపోత వర్షాలు కురుస్తాయని, ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ అధికారులు చెబుతున్నారు.

Share