టీమిండియా స‌రికొత్త చ‌రిత్ర‌

ఏపీ టాప్ న్యూస్‌: ఆస్ట్రేలియా గడ్డపై ఏడు దశాబ్దాల తర్వాత తొలి టెస్టు సిరీస్ ను భారత్‌ కైవసం చేసుకోవడం విశేషం. సమష్ఠిగా సత్తా చాటిన కోహ్లీసేన..కంగారుల మట్టికరిపించి సిరీస్ 2-1 తేడాతో దక్కించుకుంది. తాజా గెలుపుతో 72 ఏళ్లలో ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకున్నట్లుయింది. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో టీమిండియాకు గెలుచే అవకాశం వచ్చినప్పటికీ సిరీస్‌ను డ్రా చేసుకొని తిరిగి రావాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాడమనేది ఆసీస్ లో భారత్ ప్రదర్శన ఏ స్థాయిలో ఉందో అర్థమయ్యే ఉంటుంది. పాత రికార్డులను చూసి నిరాశ చెందక నూతనోత్సహంతో బరిలోకి దిగిన కోహ్లీసేన ఈ బంపర్ విక్టరీ సాధించింది. తాజ విజయంపై భారత్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిడ్నీ వేదికగా జరిగిన నాల్గో టెస్టులో ఆసీస్ ను వరనుడు ఆదుకున్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ఇన్నింగ్ -662/7 డిక్లేర్డ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 300 పరుగులకే కుప్పకూలడంతో ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ – 6/0 ఉన్న తరుణంలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. చివరి రోజు మ్యాచ్ జరిగే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ ను డ్రా అయినట్లు ప్రకటించారు. దీంతో టీమిండియా ఈ సిరీస్ ను 2-1 ఆదిక్యంతో సరికొపెట్టకోవాల్సి వచ్చింది.

Share