ఏపీ డీజీపీగా గౌత‌మ్ స‌వాంగ్‌

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read more

వైసీపీలోకి ద‌గ్గుబాటి?

ఏపీ టాప్ న్యూస్‌:“మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు త్వ‌ర‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నార‌ట‌. ఆయ‌న భార్య ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కూడా ఆయ‌న వెంటే న‌డుస్తార‌ట‌. మంచి ముహూర్తంకోసం వేచి చూస్తున్నార‌ట‌“ అంటూ ప్ర‌కాశం జిల్లాలో ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఇదే చ‌ర్చ‌. అంతేకాదు వాళ్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర‌బోతున్నారో కూడా చెబుతున్నారు. చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గుబాటి కుటుంబానికిఎప్పుడూ ఏ విధంగా స‌హాయం చేయ‌క‌పోగా వెంక‌టేశ్వ‌ర‌రావును న‌మ్మించి వెన్నుపోటు పొడిచార‌ని, దివంగ‌త నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాత్రం ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి మంత్రి ప‌ద‌వి ఇప్పించి బాగా చూసుకున్నార‌ని, అంతేగాకుండాప్ర‌కాశం జిల్లాలో వైసీపీ గాలి వీస్తోంద‌ని ఈ కార‌ణ‌ల‌తో వాళ్లు వైసీపీలోచేరే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు. అయితే ఇంకో వార్త కూడా ప్ర‌చారం ఉంది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీల‌క నేత ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుతో మాట్లాడార‌ని, ప‌రుచూరు టిక్కెట్ ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని తెలుస్తోంది. అంతేకాదు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రికఎన్నిక‌ల్లో ద‌గ్గుబాటి వార‌సుడు పోటీ చేయాల‌నుకుంటున్నార‌ని, వైసీపీ లో చేరితే గెలుపు సుల‌భం అవుతుంద‌ని ద‌గ్గ‌బాటి ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కూడా బీజేపీలో అసంతృప్తిగా ఉన్నార‌ని, ఆమె కూడావైయ‌స్ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తోంద‌ని స్థానిక ప్ర‌జ‌లు అంటున్నారు. ద‌గ్గుబాటి వారి కుటుంబం వైసీపీలో చేరితే మాత్రం ప్ర‌కాశం జిల్లాలో వైసీపీకి తిరుగులేద‌నే చెప్పాలి. అయితే ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటిప్ర‌క‌ట‌న రాలేదు. Share

Read more