విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు మద్దతు

విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు తాను మద్దతునిస్తున్నట్టు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు. రాజధానిగా విశాఖ అన్ని విధాల అనువైన నగరమన్నారు. అమరావతి రాజధానికి పనికిరాదని శివరామకృష్ణన్‌ కమిటీ గతంలోనే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రాజధానిగా అమరావతి వద్దని చెప్పినా అప్పటి సీఎం చంద్రబాబునాయుడు పట్టించుకోలేదని విమర్శించారు. రాజధాని వ్యవహారంలో ఇప్పుడు చంద్రబాబు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు.

Share