వైసీపీలోకి డీఎల్‌

ఏపీ టాప్ న్యూస్‌: మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి త్వరలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వైయ‌స్ జగన్ ఆహ్వానంపై పార్టీలో చేరుతున్నానని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సీపీ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి తదితరులు బుధవారం ఉదయం ఖాజీపేటలో డీఎల్‌ రవీంద్రారెడ్డిని కలిశారు. అనంతరం డీఎల్‌ మాట్లాడుతూ.. ‘వైఎస్‌ జగన్ నాకు ఫోన్‌ చేశారు. మీ సేవలు అవసరం పార్టీలోకి రావాలని కోరారు. చాలా ఏళ్లుగా వైఎస్‌‌ఆర్‌ కుటుంబ సభ్యుడిని. జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటా. పదిరోజుల్లో బహిరంగ సభను నిర్వహిస్తాను. రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ గెలుపు కోసం కృషి చేస్తా. వైయ‌స్ వివేకానందరెడ్డి స్థానాన్ని భర్తీ చేయాలని జగన్‌ కోరారు’ అని తెలిపారు. కాగా గత కొన్నాళ్లుగా పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే ప్రయత్నంలో ఉండి రెండువైపులా ప్రయత్నించిన డీఎల్ రవీంద్రారెడ్డి చివరకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్న విషయాన్ని ప్రకటించారు.

Share