వైసీపీ దూకుడు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరింత దూకుడు పెంచింది. 15 రోజులుగా పార్లమెంట్‌లో పోరాడుతున్నా కేంద్రం ఒక్కసారి కూడా చర్చకు అవకాశం ఇవ్వకపోవడంతో వైఎస్‌ఆర్‌ సీపీ వ్యూహం మార్చింది. పార్లమెంటు సమావేశాలను ముందస్తుగానే వాయిదా వేస్తారనే సమాచారంతో మార్చి 21న కాకుండా రేపు (శుక్రవారం) అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది.

ఈ మేర‌కు పార్ల‌మెంట్ సెక్ర‌ట‌రీకి ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొద్దిసేప‌టి క్రితం నోటీసులు అంద‌జేశారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం మాట త‌ప్పింద‌ని, ఈ విష‌యంలో చ‌ర్చించేందుకు అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా అవిశ్వాసంపై మద్దతు కూడగట్టేందుకు టీడీపీ సహా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతును కోరనుంది. ఈ మేరకు ఆయా పార్టీల నేతలను వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు కలుస్తున్నారు. బీజేడీ నేత భర్తృహరి మెహతాబ్‌, టీడీపీ ఎంపీ తోట నరసింహం, టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి తదితరులను కలిసిన వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పార్లమెంట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా రోజే వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు. మరోవైపు పార్లమెంట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా రోజే వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *