ఆర్థిక సంస్కరణలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక శక్తిగా అవతరించిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలక చోదక శక్తిగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఆర్థిక సంస్కరణలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక శక్తిగా అవతరించిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలక చోదక శక్తిగా (Growth Engine) ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చైనా వంటి దేశాలు ఆర్థిక వృద్ధి సాధించడానికి దశాబ్దాల కాలం పట్టిందని, కానీ ప్రధాని మోదీ ఆధునిక ఆలోచనల వల్ల భారత్‌కు అంత సమయం పట్టడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సింగపూర్ అధికారిక పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి తొలిరోజైన సోమవారం అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడిపారు. సింగపూర్ ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేలతో పాటు గూగుల్ క్లౌడ్, యూఎన్ హాబిటాట్, వైసీహెచ్ లాజిస్టిక్స్ , ప్రముఖ గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుసగా భేటీ అయ్యారు.
డిజిటల్ గవర్నెన్స్, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పుల కోసం గూగుల్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో సీఎం చంద్రబాబు జరిపిన భేటీ సూపర్ సక్సెస్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ఒక సంయుక్త ‘ప్రత్యేక టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్ , డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం తెలిపారు. ప్రభుత్వ సేవలలో ఏఐ వినియోగం, రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) బలోపేతం, వర్సిటీలలో ఏఐ స్కిల్లింగ్ సెంటర్లు, , వైద్య రంగంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సంజీవని’ ప్రాజెక్టులో గూగుల్ క్లౌడ్ భాగస్వామ్యంపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు.
ఆరిజన్ వెంచర్స్, ఏలెవ్ 8 వెంచర్స్, క్వోనా క్యాపిటల్, జంగిల్ వెంచర్స్ వంటి అంతర్జాతీయ ప్రముఖ స్టార్టప్ వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీలో తయారీ రంగాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు తాము ‘వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్’ (ఇంటికో పారిశ్రామికవేత్త) అనే వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీకి అడ్వాన్స్ డ్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (AMCA) వంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్ల తయారీ సంస్థలతో పాటు గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి పరిశ్రమలకు అత్యంత వేగంగా అనుమతులు, భూములు కేటాయించామని గుర్తుచేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ద్వారా అద్భుతమైన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు , ఏపీ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీసిటీ లాంటి ప్రత్యేక పారిశ్రామికవాడలు పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్నాయని, ఏపీలో ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇదే సరైన సమయమని సీఎం వివరించారు.
వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్‌తో జరిగిన భేటీలో ఏపీలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ ‘సప్లై చైన్ సిటీ’, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపై కీలక చర్చలు జరిగాయి. ఏపీకి ఉన్న 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం, హైవేలు, పోర్టులు, రైల్వే కనెక్టవిటీ లాజిస్టిక్స్ వ్యయాన్ని భారీగా తగ్గిస్తాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యానరంగం (Horticulture)లో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఆక్వాకల్చర్‌లో ఏపీ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందని వివరించారు. అలాగే, సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో జరిగిన భేటీలో ఏపీ అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని కాంక్షించారు. ఏపీలో కొత్తగా అందుబాటులోకి వస్తున్న పోర్టుల వల్ల షిప్ బిల్డింగ్, సివిల్ ఏవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ (MRO) కేంద్రాలకు అపార అవకాశాలు ఉన్నాయని, రోబోటిక్స్, హార్డ్‌వేర్ రంగాల్లో సింగపూర్ సహకారం కావాలని చంద్రబాబు కోరారు.
రాష్ట్రంలోని పట్టణాల సుస్థిర అభివృద్ధి కోసం యూఎన్ హాబిటాట్ (UN-Habitat) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్‌బాక్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 'యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటుకు ఉచితంగా భూమి కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించగా, వారు సానుకూలంగా స్పందించారు. 2028 నాటికి నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా స్పష్టమైన టైమ్‌లైన్‌తో కూడిన ఎంవోయూ (MoU) చేసుకోవాలని సీఎం ప్రతిపాదించారు. తీరప్రాంత నగరాల రక్షణకు ఉద్దేశించిన ‘రైజప్’ కార్యక్రమం, మురికివాడల అభివృద్ధికి 'పార్టిсиపేటరీ స్లమ్ అప్‌గ్రేడింగ్ ప్రోగ్రామ్' (PSUP), మధ్యస్థాయి నగరాల్లో 'అర్బన్ రాస్తా ఫ్రేమ్ వర్క్' అమలు , మున్సిపల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వాల్యూ కాప్చర్ ఫైనాన్సింగ్ వంటి ఆధునిక పద్ధతులపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశాలలో మంత్రి పి.నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఈడీబీ సీఈఓ షన్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.