ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కూడా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టులు పెట్టినందుకు గాను జనసేన పార్టీ కార్యకర్త కొర్ర చందర్ లాల్‌ను తెలంగాణ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ విధుల్లో ఉన్నవారిని విమర్శించేటప్పుడు హద్దులు దాటకూడదని, సోషల్ మీడియాలో విచక్షణ (కామన్సెన్స్) కోల్పోతే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ‘ఎక్స్’ (X) వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఈ అరెస్ట్ వ్యవహారం నడుస్తుండగానే, మరోవైపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కూడా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల ఒక సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ తన వద్దకు వచ్చి కారు అడిగారని, తాను దాన్ని బహుమతిగా ఇచ్చానని చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు, న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లేని వ్యక్తిపై అబద్ధాలు అల్లుతూ పరువు నష్టం కలిగించేలా ప్రసంగించారని న్యాయవాదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.