మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్కడికి వెళ్లినా పోలీసులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. నిన్న జరిగి కాపునేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లోనూ పోలీసుల పట్ల ఆయన వ్యవహరించిన వైఖరి చూపరులను

రచ్చ రాంబాబు... ఎక్కడికెళ్లినా పోలీసులతో వాగ్వాదమే
దూషణలు...అరుపులు... కేకలు...బెదిరింపులు
పార్టీ కార్యక్రమమైనా... చావు ప్రదేశాలైనా అంబటి అరుపులే
పోలీసుల్ని నెట్టేయడం... వేలు చూపించడం... మర్యాద లేకుండా ప్రవర్తించడం
తాజాగా ముద్రగడ అంత్యక్రియల్లోనూ పోలీసులపై అంబటి స్వైర విహారం
వివాదాస్పదమవుతున్న అంబటి తీరు
అమరావతి : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆయన పాల్గొంటున్న వివిధ కార్యక్రమాల్లో పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిరసన కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, వ్యక్తిగత పరామర్శలు, అంత్యక్రియలు వంటి సందర్భాల్లో కూడా పోలీసులతో వాగ్వాదాలకు దిగుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి.
గతంలో సత్తెనపల్లికి వైసీపీ అధినేత జగన్ వస్తున్న సమయంలో జాతీయ రహదారిపై అంబటి రాంబాబు నానా యాగీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణ చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను నెట్టివేశాడు... బారికేడ్లు తోసేసి రచ్చ రచ్చ చేశారు. ఆ తర్వాత గుంటూరులో ఓ నిరసన కార్యక్రమంలో ఎస్ఐ, సీఐ, కానిస్టేబుళ్లపై దూషణలకు దిగారు. సీఐను ఏం పీకుతావు, పొడుస్తావా అంటూ బూతులు వర్షం కురిపించారు. ఇటీవల అమరావతిలోనూ ఓ పోలీసు అధికారిని గట్టిగా నెట్టేశారు. వేలు చూపిస్తూ దూసుకెళ్లారు. ఇవన్నీ ఒకఎత్తు. అయితే బుధవారం వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లోనూ పోలీసుల పట్ల అంబటి రాంబాబు వ్యవహరించిన వైఖరి చూపరులను అసహ్యానికి గురి చేసింది.
ముద్రగడ పద్మనాభం ఎంపీగా, మంత్రిగా చేశారు. ఆయన మరణంతో ప్రభుత్వం గౌరవార్ధంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాంఛనాలు ప్రారంభించారు. ఇది చూసిన అంబటి ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఓ డీఎస్పీపై అరుపులు కురిపించారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చే కానిస్టేబుళ్లను నెట్టి వేశారు. కంచె అవతలికి వెళ్లే వరకూ వారిని తోసేస్తూనే ఉన్నారు. పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. ముద్రగడ తనకు పోలీసు లాంఛనాలు వద్దన్నారని అంబటి చెప్పుకొచ్చారు... అయితే తిరస్కరించే విధానం ఇదేనా అనే ప్రశ్రలు లేవనెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్నా రాజకీయం చేసేందుకు అంబటి మాత్రం గట్టినా తన విశ్వరూపం చూపించారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ విధానాలను విమర్శించడం, నిరసనలు చేపట్టడం రాజకీయాల్లో సహజమే అయినప్పటికీ, విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై పదేపదే ఆగ్రహావేశాలు ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చట్టం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పనిచేస్తున్న పోలీసుల పట్ల ఒక మాజీ మంత్రి ఇలాగేనా ప్రవర్తించేదనే విమర్శలు వస్తున్నాయి.
అంబటి రాంబాబు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో ఏదో ఒక రూపంలో పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకోవడం, వారిని నెట్టివేయడం లేదా తీవ్ర వ్యాఖ్యలు చేయడం తరచుగా కనిపిస్తోంది. మొత్తానికి, సత్తెనపల్లి నుంచి అమరావతి వరకు, అక్కడి నుంచి ముద్రగడ అంత్యక్రియల కార్యక్రమం వరకు అంబటి రాంబాబు ప్రవర్తనను ప్రజలు మరోసారి ఛీ కొట్టారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు అధికార యంత్రాంగంతో వ్యవహరించే తీరు ప్రజలకు ఆదర్శంగా ఉండాలిగానీ ఇదేం దౌర్భాగ్యం అని అభిప్రాయం వ్యక్తమవుతోంది.